Wednesday, 4 November 2026

ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన విద్య

శాతవాహన యూనివర్సిటీ, జనంసాక్షి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే నైతిక విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతోందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రభుత్వ లెక్చరర్ల సంఘం సమావేశంలో మాట్లాడారు. అణగారిన వర్గాల అభివృద్ధిలో పాలు పంచుకోవడంలో లెక్చరర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రైవేటు కళాశాలల మధ్య పోటీతో ప్రభుత్వ కళాశాలలు బలహీనపడుతున్నాయని పేర్కొన్నారు. ఇంటర్‌ విద్య పరిరక్షణకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు ఐక్యంగా పోరాడాలన్నారు. జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా, డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతులు ఇప్పించేందుకు మార్గం సుగమమైందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *