– ఎంపీపీ గూడెపు శ్రీనివాసుహుజూర్ నగర్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి): ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలని హుజూర నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయములో పంచాయితీ కార్యదర్శులకు ఉపాధి అధికారులతో సమీక్షా సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశము నందు
హుజూర్ నగర్ మండలమునకు వచ్చిన జి ఎస్, ఎస్ డి ఎఫ్, సిడిపి, ఎంపీ ఎల్ ఏ డి ఎస్, 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి మంజూరి అయిన పనుల గురించి పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది. మరుగుదొడ్లు లేని వారికి మరుగుదొడ్డి నిర్మించుకోవడంలో అవగాహన కల్పించవలసిందిగా ఎంపీడీవోని, ఎంపీపీ కోరారు.
ఆసరా పెన్షన్లు భర్త చనిపోతే భార్య కి 57 సంవత్సరాలు లోపు వయస్సు వారికి వితంతు పెన్షన్, 57 సంవత్సరాలు దాటితే ఓఏపీ పెన్షన్ వస్తుంది. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పాటు పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రజలకు అనేక పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి టి.శాంత కుమారి, మండల పంచాయితీ అధికారి ఎస్.కె. మౌలానా, శ్రీ సాయి రామ్, నర్సిరెడ్డి, పర్యవేక్షకులు, కార్యాలయ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు జి ఎస్ సిబ్బంది హాజరైనారు.




