Wednesday, 4 November 2026

భక్తులను ఆనందింపజేసిన పవళింపు సేవ

 

 

 

 

 

హుజూర్ నగర్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి): పట్టణంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం పవళింపు సేవ భక్తులను ఆనందింపజేసినది. ఫణిగిరి గట్టు నుంచి వచ్చిన స్వామివారికి ప్రాత:కాలార్చనలు, పూజలు జరిపి సాయంకాలం ఆలయంలోని అద్దాల మండపంలో పవళింపు సేవలు జరిపినారు. సేవ చేసే ఊయలను పట్టు వస్త్రాలతో, పూలమాలలతో, పట్టుపరుపులతో అందంగా సిద్ధం చేశారు. స్వామివారిని, అమ్మవారిని ఊయలలో వేంచేసి, జోల పాటలతో, లాలి పాటలను భక్తులు శ్రావ్యంగా గానం చేశారు. దోరకునా ఇటువంటి సేవ, రామా నిన్నే నమ్మినాను రా కిర్థనలు, మహిళలు ఆలపించిన చూడరమ్మ సతులారా, రామచంద్రుడీతడు పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తరువాత కళాకారులను దేవాలయ ఈ.ఓ గుజ్జుల కొండారెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, భాస్కరాచార్యులు, మురళి కృష్ణమాచార్యులు, వేదాంతం మోహన కృష్ణమాచార్యులు, గాయకులు కంబాల శ్రీనివాస్, దామోదరా చార్యులు, లక్ష్మీనారాయణ, ఇందిరా, సుజాత మరియు మహిళలు, భక్తులు, అభివృద్ధి సమితి సభ్యులు పాల్గొన్నారు