హుజూర్ నగర్ మే 2 (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మనబడి కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లింగగిరి గ్రామం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ అదనపు తరగతి గదుల నిర్మాణం, అవసరమైన ఫర్నీచర్ కొనుగోలు, మరుగుదొడ్లతో పాటు మెరుగైన విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు, డిజిటల్ తరగతి గదులకు పరికరాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు పూర్తి చేసుకొని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ అంజిరెడ్డి, ఎంపీటీసీ వల్లభనేని విజయలక్ష్మి, ఎస్ఎంసి చైర్మన్ వీరబాబు, హెడ్మాస్టర్ సాముల వెంకట్ రెడ్డి, గాయం ధనలక్ష్మి, ఇందిరాల జ్యోతి, ఉప సర్పంచ్ రమా, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




