Tuesday, 3 November 2026

ఇండ్ల మధ్యలో ఉన్న గోవదశాలను తరలించాలి

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డ్ ఓకే అంబేద్కర్ నగర్ లో రోజు ఉదయమే పశువులను వదిస్తూ అమ్ముతున్నారని, వాటి వ్యర్థాలు కూడా అక్కడే పడేస్తున్నారని ఇళ్ల మధ్యలో ఉన్న గో వద శాలను తరలించాలని కోరుతూ బిజెపి నాయకులు మంగళవారం మంథని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ గో వద శాల ద్వారా ఇక్కడ నివసించే వారికి చాలా దుర్వాసన వస్తున్నదని, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని విపరీత మైన దోమలతో విష జ్వరాల భారిన పడి పిల్లలు, వృద్దులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని,
వెంటనే మున్సిపాలిటీ పాలక వర్గం అధికారులు స్పందించి ఇండ్ల మద్యలో వున్న గోవధ శాలను తరలించాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బని సంతోష్, మంథని అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్ పోతరవేణి క్రాంతి , బూడిద తిరుపతి, దాసరి శ్రావణ్ , కాసర్ల సూర్య , పార్వతి విష్ణు తదితరులు పాల్గొన్నారు.