ప్రభుత్వ పాఠశాలలో దొంగతనం.
విలువైన పరికరాలను దోచుకెళ్లిన దుండగులు.
కోటగిరి(పోతంగల్)డిసెంబర్ 19 జనం సాక్షి:- పోతంగల్ మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో దొంగలు పడ్డారు.ఆదివారం సెలవు దినం కావడంతో దుండగులు పాఠశాలలోని కంప్యూటర్ గది యొక్క తాళం చెవిని పగలగొట్టి గదిలోని సుమారు మూడు లక్షల విలువైన కంప్యూటర్స్,ఇన్వేటర్స్,ఎల్ఈడి టీవీ,ప్రొజెక్టర్లను దోచుకెళ్లారు.ఈ విషయాన్ని సోమవారం ఉదయం గుర్తించిన ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మచ్చెంధర్ రెడ్డి తెలిపారు.




