Saturday, 7 November 2026

జాతీయస్థాయి ఓపెన్ కరాటే పోటీలో గోల్డ్ మెడల్స్ సాధించిన సిఓఈ విద్యార్థులు

జాతీయస్థాయి ఓపెన్ కరాటే పోటీలో గోల్డ్ మెడల్స్ సాధించిన సిఓఈ విద్యార్థులు.
– 4 బంగారు పథకాలు, ఒక వెండి,2 కాంస్య పథకాలు.
– అభినందించిన ఆర్సిఓ కొప్పుల స్వరూప రాణి
– గురుకులంలో విద్యార్థులను సన్మానించిన ప్రిన్సిపల్ ఐనాల సైదులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 19, (జనంసాక్షి )
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్థులు జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో నాలుగు గోల్డ్ మెడల్, ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
ఈ నెల 18న బెల్లంపల్లి టిసిఓ క్లబ్ లో విక్టోరియా సోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విద్యార్థులు మెడల్స్ సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. డి వరప్రసాద్, వై ఉదయ్, ఆర్ ప్రణవ్, జి జయంత్ లు అత్యంత ప్రతిభ చూపి బంగారు పథకాలు సాధించగా వై మహోన్నత్, ఐ గౌతమ్ సాయి, డి ఆశిత్ లు వరుసగా వెండి కాంస్య పథకాలు సాధించారు. ఇండియన్ యోగ స్కూల్ బెల్లంపల్లి లో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి యోగా ఛాంపియన్షిప్ 2022 లో ఆర్ అవిష్, ఎం సాయి తీర్థన్ వెండి పథకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. జాతీయస్థాయిలో సత్తా చాటి మెడల్స్ సాధించిన విద్యార్థులను సంక్షేమ గురుకులాల ఆదిలాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూప రాణి అభినందించారు. సోమవారం బెల్లంపల్లి గురుకులం ఆవరణలో మెడల్స్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యాపక, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా సన్మానించింది.
ఈ కార్యక్రమంలో పీఈటి వామన్ అధ్యాపకులు మిట్ట రమేష్ , నాగిని శ్రీరామ వర్మ , ఆకినేపల్లి రాజేష్, ఉపాధ్యాయులు వరమని ప్రమోద్, భోగ అశోక్, పి రాజకుమార్, శ్యాంసుందర్ రాజు, స్రవంతి, సబియా భాను, దత్త ప్రసాద్ ఆర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.