Thursday, 5 November 2026

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

 

 

 

 

 

 

 

 

 

ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి సమిష్టి కృషి చేయాలి………

ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకట్ రావు…….

 

మల్లాపూర్ మార్చి:12 (జనం సాక్షి)ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకట్ రావు అన్నారు. శని వారం కుస్తాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల వార్షికోత్సవాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా బడుగు బలహీన, సబ్బండ వర్గాల పిల్లలు చదువును అభ్యసిస్తారని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వాలు మధ్యాహ్నం భోజనం, ఉచిత స్కూల్ డ్రెస్సులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకారవేతనాలు తదితర అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రైవేటు స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా సాధిస్తున్నారని అన్నారు.