Thursday, 5 November 2026

పిల్లల వ్యక్తిత్వ వికాసం పై అవగహన

ముప్కాల్ (జనంసాక్షి) మార్చ్ 12 మండల పరిధిలోని న్యూ హరిజన్స్ పాఠశాలలో పిల్లల వ్యక్తిత్వ వికాసం పై అవగాహన సదస్సును తల్లిదండ్రులకు నిర్వహించారు నేటి సమాజంలో పిల్లల వారి ఎదుగుదల లో ప్రభావం ఆలోచన జీవనశైలి పెద్దలపట్ల అగౌరవం చదువు మీద శ్రద్ధ లేకపోవడం వంటి అనేక అంశాల మీద తల్లిదండ్రులతో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ హాజరై అనేక అంశాల పట్ల పిల్లలకు తల్లిదండ్రులకు సూచనలను సలహాలను అందించారు అనంతరం మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ చంద్ర విలాస్ కరస్పాండెంట్ రత్నాకర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు