సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని మోతె మండలం రాఘవాపురం గ్రామ సర్పంచ్ గుండాల గంగులు అన్నారు.బుధవారం ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.విద్యార్థులకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇవ్వడంతో పాటు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు ఉన్నాయన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య




