Tuesday, 3 November 2026

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఆర్ధిక సహాయం చేసిన దాతకు ఘన సన్మానం

కోటగిరి ఫిబ్రవరి 27 సాక్షి:-పోతంగల్ మండలం సుంకిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ మూడు లక్షల పదహారువేల ఆర్ధిక సహాయాన్ని అందజేసిన బస్వాపూర్ వాస్తవ్యులు,హైదరాబాద్ పట్టణంలో స్థిరపడ్డ బిల్డర్ ముమ్మాలనేని రాజశేఖర్ నీ స్థానిక ప్రజా ప్రతినిదులు,పాఠశాల యాజమాన్యం సోమవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఒక లక్ష రూపాయల విలువ చేసే 20 డ్యుయర్ డేస్క్ బెంచీలు,అలాగే లక్ష రూపాయల విలువ చేసే 11 గ్రీన్ బోర్డులు,పాఠశాల సహాయక నిధికి లక్ష 16 వేల రూపాయలు అనగా మొత్తం కలిపి 3 లక్షల 16 వేల రూపాయలు వారు విరాళం అందజేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు.విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించా రు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబశివారెడ్డి,స్థానిక సర్పంచ్ మాధవరావు, ఎంపిటిసి సాయిలు,ఉపసర్పచ్ సిందే దిగంబర్, ఎస్ఎంసి చైర్మన్ గైక్వాడ్ మారుతి,పోతంగల్ మండల పిఆర్టియు అధ్యక్షులు సుధం వెంకటేష్, ప్రధాన కార్యదర్శి,బోధన్ డివిజన్ కమ్మ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు,అమ్మ వృద్ధానాశ్రమం అధ్యక్షులు శ్రీనివాసరావు,ఏయంసి డైరెక్టర్ చింతల్వార్ హను మంతు,రైతు సమన్వయ మండల అద్యక్షులు కందుర్కి వీరేశం,విలేజ్ అద్యక్షులు షాజి,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థిని,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.