Tuesday, 3 November 2026

విద్యార్థులు ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలి.విద్యార్థులు ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలి.  ఎస్పీ అఖిల్ మహాజన్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 27. (జనంసాక్షి). విద్యార్థులు మూఢనమ్మకాలను ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా గ్రంధాలయ సంస్థ భవనంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్య దశలోనే  తార్కిక ఆలోచనలతో వైజ్ఞానిక వైఖరి కలిగే విధంగా ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాల్సి ఉందని అన్నారు. మూఢనమ్మకాలను ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. నిత్య జీవితంలో సైన్స్ ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. జిల్లా నుండి జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులను శాలువాలు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, బుగ్గారెడ్డి, డాక్టర్ వంశీ, రవి, గన్న మనేనీ శ్రీనివాసరావు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.