జనం సాక్షి /కొల్చారంప్రభుత్వం వాహనాన్ని సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న అధికారులు రోజురోజుకు ఎక్కడో అక్కడ తరస పడుతున్నాడు సహజంగా మారింది. కేవలం ప్రభుత్వ వినియోగించాల్సిన వాహనాన్ని పెళ్లిళ్లు పేరంటాలకు తిప్పుతున్న సంఘటన గురువారం కొల్చారం మండలంలో వెలుగు చూసింది. మెదక్ ఎక్సైజ్ సీఐ తన వాహనాన్ని పెళ్లిళ్లు పేరంటాల కోసం వినియోగించడం గమనాభం మండలంలోని చిన్నదానపుర్ ఐఎంఎల్ డిపోలో అమలిగా పనిచేస్తున్న ఒక యువకుడి వివాహం గురువారం కొల్చారం బాబా ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి మెదక్ ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు తన అధికారిక వాహనంలో సిబ్బందితో కలిసి రావడం చర్చనీయాఅంశంగా మారింది . సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని పెళ్లికి వచ్చిన ప్రజలు యువకులు కోరుతున్నారు.




