Tuesday, 3 November 2026

ప్రభుత్వ వైఖరి వల్లే రోడ్డెక్కిన పోలీసు కుటుంబాలు: వర్ల రామయ్య

గుడివాడ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అవగాహనరాహిత్యం వల్లే పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్‌ హయాంలో రద్దు చేసిన ఆర్డీర్లీ వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరుద్ధరించిందని ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో తెలిపారు. ఈ కారణంగా పోలీసు కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కృష్ణా జిల్లాలో పోలీసు శాఖలో పనిచేసిన తనకు వారు ఎదుర్కొంటున్న  సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *