Tuesday, 3 November 2026

ప్రభుత్వ వైద్యుడి ఆత్మహత్య

హైదరాబాద్‌ : ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసే బాలాజీ అనే వ్యక్తి స్వయంగా మత్తు ఇంజక్షన్‌ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్‌ మండలం తుర్క యాంజాల్‌కు చెందిన బాలాజీ, మాధవీలత దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గైనకాలజిస్టు అయిన మాధవీలత మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి బాలాజీయే కారణమని మాధవీలత తల్లిదండ్రులు కేసు పెట్టగా పోలీసులు బాలాజీని అరెస్టు చేశారు. బెయిల్‌మీద మూడు రోజుల క్రితం బయటకు వచ్చిన బాలాజీ భార్య మృతికి తాను కారణం కాదని, తనను అనవసరంగా ఇరికించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని నోట్‌ రాసి చనిపోయాడు. తండ్రి కూడా మరణించడంతో పిల్లలిద్దరు అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *