శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 10ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం చింతల పల్లె గ్రామంలో ఓ యువకుడు మురికి కాలువలో పడి శుక్రవారం మృతి చెందినట్లు కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ చంద్రశేఖర్ పూర్తి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతల పల్లె గ్రామానికి చెందిన దున్నపోతుల శ్రీనివాస్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న మురికి కాలువలో పడి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి భార్య దున్నపోతుల రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




