Wednesday, 4 November 2026

ఎస్సీ కాలంలో పర్యటించిన శంకరపట్నం జెడ్పిటిసి…

 

 

 

 

 

 

 

 

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 10శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలోని ఎస్సీ కాలనీ శుక్రవారం మండల జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. శంకరపట్నం మండల అభివృద్ధి కోసం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రెండు కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా విడుదల చేసినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా నిధుల విడుదలకు కృషి చేసిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జెడ్పిటిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల పరిషత్ వైస్ ఎంపీపీ పులి కోట రమేష్ హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తుముల శ్యామ్ రావు, గద్దపాక గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు పులికోట మహేందర్, టిఆర్ఎస్ నాయకులు మాతంగి కుమార్, సాయికుమార్ తదితరులు ఉన్నారు.