సర్పవరం జంక్షన్: కార్మికుల సమ్మెతో తూర్పుగోదావరిలోని కాకినాడ లంగరు రేవు (యాంకరేజ్ పోర్టు)లోని వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. రేవులోని బ్యాడ్జీల యజమానులకు, కార్మికులకు తలెత్తిన వివాదంలో మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి జోక్యాన్ని నిరసిస్తూ ఈరోజు కార్మికులు సమ్మెకు దిగారు. 88 బ్యాడ్జీల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో దాదాపు రూ. 8కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి.




