Friday, 6 November 2026

ప్రయాణికుల దప్పిక తీర్చేందుకు ఉచితంగా చల్లని మజ్జిగ – సాకేతపురి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో

 

 

 

 

 

బూర్గుంపహాడ్ ఏప్రిల్ 17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బూర్గుంపహడ్ మండలం సారపాక గ్రామం సాకేతపురి అయ్యప్ప స్వామి భక్తులు ఉచితంగా చల్లని మజ్జిగ 300 లీటర్లు వితరణగా అందజేశారు. సోమవారం అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు రాజేష్ పాండే ఆదేశానుసారం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ను పురస్కరించుకొని ఎండాకాలం దప్పిక తీర్చేందుకు ఉచిత చల్లని మజ్జిగను సారపాక నాలుగురోడ్ల కూడలిలో ఉదయం 11 నుండి మూడున్నర గంటల వరకు ప్రయాణీకులకు, పాదచారులకు అందించారు. ఈ కార్యక్రమం ధర్మజాగరణ సమితి, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి  వారి సౌజన్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎ బి ఎ డి పి ఎస్ జిల్లా కార్యదర్శి ఎం, వి.సుబ్రహ్మణ్యం, బూర్గంపహాడ్ మండల అధ్యక్షులు జాదవుల కనకారావు, వై కామేశ్వరరావు, కమల్ సాహు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.