జనంసాక్షి , మంథని : సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్ సతీమణి ఉమాదేవి పుట్టినరోజు సందర్భంగా మంథని మండలం లక్కేపూర్ గ్రామం లోని నిరుపేద కుటుంబం అయిన పదాల రాజేశ్వరి కి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్, చైర్మన్ మేడగొని వెంకటేష్, సభ్యులు విజయ్ శంకర్, వెంకటేశ్వర్లు, అనిల్, రాజయ్య, అఖిల్ పాల్గొన్నారు.




