Wednesday, 4 November 2026

ప్రశంసా పత్రం అందుకున్న డిపిఆర్ఓ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ వెంకటరత్నం

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.దీనిలో భాగంగా డిపిఆర్ఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మొండికత్తి వెంకటరత్నం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ , ఎస్పీ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.అనంతరం వెంకటరత్నం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గుర్తింపు రావడం పట్ల సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయనకు డిపిఆర్ఓ రమేష్ తో పాటు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.