దండేపల్లి,జనంసాక్షి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషదారణలతో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ హన్మంతరావు, ఎంపీడీవో మల్లేషం, పోలీస్ స్టేషన్ లో ఎస్సై మచ్చ సాంబమూర్తి, మండల విద్యార్ది కార్యాలయంలో ఎంఇవో కాసుల రవింధర్,సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ కాసనగొట్టు లింగన్న,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, బిజెపి మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు లింగంపల్లి బాపు,గ్రామపంచాయతి కార్యాలయాలలో సర్పంచులు, కుల సంఘ,రాజకీయ నాయకులు జాతీయ పతకాలు ఎగురవేశారు.
ఫోటో రైటప్ : జెండా ఎగురవేస్తున్న తహసీల్దార్.
భరత మాత వేషధారణలో చిన్నారి…




