Wednesday, 4 November 2026

ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి, జనవరి 26( జనం సాక్షి): 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కె.వి శ్రీనివాసరావు, టేకులపల్లి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భూక్య రాధ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్ర సమరయోధుల మహానుభావుల గురించి కొనియాడారు. మిఠాయిలు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, అధికారులు,సిబ్బంది, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, టేకులపల్లి ఎస్సై భూక్య శ్రీనివాస్, పోలీసు సిబ్బందితదితరులు పాల్గొన్నారు.