Thursday, 5 November 2026

ప్రశాంతంగా కలకోవ మత్స్య సహకార సంఘం ఎన్నికలు

 

 

 

 

 

మునగాల, మార్చి 14(జనంసాక్షి): కలకోవ మత్స్య శాఖ సహకార సంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. గతంలో మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలు మంగళవారం ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అధికారులు ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు 33 మంది సభ్యులు హాజరు కావడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 11 గంటలకు 33 మందిలో తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో పోటీకి ఎవరు రాకపోవడంతో వారి డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి డి. నాగేశ్వరరావు తెలిపారు. అధ్యక్షునిగా అనంత గురవయ్య, ఉపాధ్యక్షులుగా పాతకోట్ల లింగయ్య, కార్యదర్శిగా బుర్రిబాబు, మరో ఆరుగురు డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు తెలిపారు. మునగాల సిఐ ఆంజనేయులు, ఎస్సై లోకేష్ ఆధ్వర్యంలో కోదాడ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి ఐదుగురు సిఐలు 12 మంది ఎస్ఐలు 102 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఎట్టకేలకు ప్రశాంతంగా కలకోవ మత్స్య సహకార సంఘం ఎన్నికలు జరిగాయి.