– మత్స్య సహకార సంఘం సొసైటీ ఎన్నికల్లో సంఘ సభ్యులు నీతి నిజాయితీకి పట్టం కట్టారు
– బుర్రి శ్రీరాములుమునగాల, మార్చి 14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2018 సంవత్సరం నుండి కలకోవ గ్రామంలో అధికార పార్టీ చెందిన ప్రజాప్రతినిధులు మత్స్య సహకార సంఘం సొసైటీ లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, అనేక ఇబ్బందులకు గురిచేశారని మత్స్య సహకార సంఘం సొసైటీ మాజీ అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అన్నారు. మండల పరిధిలో కలకోవ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, మత్స్య సహకార సంఘం సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవం ఎన్నికలు జరగడం శుభసూచికమని అయన అన్నారు. ఎట్టకేలకు మత్స్య సహకార సంఘం సొసైటీ ఎన్నికల్లో సంఘ సభ్యులు నీతి నిజాయితీకి పట్టం కట్టారని బుర్రి శ్రీరాములు అన్నారు.




