తిరుమలగిరి (సాగర్) ఫిబ్రవరి 10 (జనంసాక్షి): మండల కేంద్రంలో శుక్రవారం తిరుమలగిరి పెద్ద చెరువు నిర్వహించిన సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్నికలు ఆశాంతం ఉత్కంఠ భరితంగా సాగాయి . ఎన్నికలు ముగిసిన అనంతరం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టి ఈ సందర్భంగా గెలుపొందిన సభ్యులను వారు ప్రకటించారు గెలుపొందిన వారిలో పిట్టల కృష్ణ, కటికల మల్లయ్య, పిడిగం ఎల్లోజి, చంద్రవంక సైదులు, నీరుటి రవి పిట్టల తిరుమలయ్య, నీరుటి తిరుమలయ్య, కూర వీరమ్మ, పిట్టల ఎల్లమ్మలు గెలుపొందినట్లు ఎన్నికల అధికారి షణ్ముఖ చారి తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నిక పత్రాలను అందజేశారు. శనివారం గెలుపొందిన 9 మంది సభ్యులు చైర్మన్ ,మిగిలిన పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారని ఈ సందర్భంగా ఎన్నికల అధికారి తెలిపారు .గెలుపొందిన అభ్యర్థులకు సొసైటీ సభ్యులు, గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.




