సమాచార హక్కు చట్ట దరఖాస్తున్యాయవాది పసునూరి శ్రీనివాస్మెట్ పల్లి టౌన్, ఫిబ్రవరి 10,
జనంసాక్షి :మెట్ పల్లి పట్టణంలోని అక్రమ గృహ నిర్మాణాల వివరాలు కావాలని ప్రజా సమాచార అధికారి అయిన మెట్ పల్లి మునిసిపల్ మేనేజర్ శేషు వెంకటలక్ష్మి కి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినట్టు న్యాయవాది మరియు తెలంగాణ జన సమితి పట్టణ అధ్యక్షుడు పసునూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మెట్ పల్లి పట్టణంలోని 26 వార్డులలో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నరన్నారు. మామూళ్ల మత్తులో అధికారులు చూసి,చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అనుమతి లేకుండా మరియు అనుమతికి విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించే విషయంలో మున్సిపల్, రెవిన్యూ మరియు ఎన్ పోర్స్ మెంట్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గుతున్నారని ఆరోపించారు. గత మూడేళ్ళలో మెట్ పల్లి పట్టణంలోని అక్రమంగా నిర్మించిన వివరాల్ని సేకరించి, వాటిని చట్టప్రకారం కూల్చివేయడానికి మరియు నిర్లక్ష్యం తో పాటు అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని దరఖాస్తు దారుడు పసునూరి శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు.




