.ప్రశ్నాపత్రాల లీకేజీ పై కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా.
నాగర్ కర్నూల్ జిల్లా జనంసాక్షి:
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారంపై సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరుద్యోగుల నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెడనూరి దిలీపాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం వల్ల రద్దయిన పరీక్షల వల్ల నష్టపోయిన విద్యార్థి విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరి చొప్పున లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని వారి డిమాండ్ చేశారు.ప్రశ్నాపత్రాల లీకేజీ కారకులైన మంత్రులు కేటీఆర్ ను సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.ప్రశ్నా పత్రాలు లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈ పరీక్షల్లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.తక్షణమే రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి 3016 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన 2014 సంవత్సరం నుండి నేటి వరకు ఎన్ని పేపర్లు లీకయ్యాయో వాటిపై సిబిఐతో విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నామని అన్నారు.తక్షణమే జరిగిన ఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షాన తెలంగాణ విద్యార్థులు మరియు నిరుద్యోగ లోకం ఈ ప్రభుత్వం మీద తీవ్రంగా పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రశ్నాపత్రాల లీకేజీలో కల్వకుంట్ల కుటుంబం కనుసన్నల్లోనే చాలా ఏండ్లుగా కొనసాగుతున్న పెద్ద స్కామని గత చైర్మన్ కాలంనుండి జరుగుతునాన్నాయని అప్పుడు బయట పడలేదని,ఇప్పుడు బయటపడిందని అన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని నియామకాలను సిబిఐ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు రాధారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎలిమె రాము, భూషయ్య లోహిత్ రెడ్డి,యశ్వంత్,మైనారిటీ మోర్చా అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ జిల్లా కోశాధికారి యుగంధర్ రావు, కార్యాలయ కార్యదర్శి చందు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీశైలం, సోషల్ మీడియా కన్వీనర్ నరేష్ చారి సంతోష్ కుమార్, మహిళ మోర్చా శశికళ, ఇందిరా, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు,నాయకులు తిరుపతయ్య,రాజారామేశ్వరరావు, నారాయణ చారి, శరత్,కడారి కృష్ణ,పర్వతాలు, చాపల సైదులు,బొట్టు శీను, నేష లక్ష్మయ్య,ప్రమోద్ కుమార్, నరసింహ మేస్త్రి,వేముల భూపతి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ పై కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా




