పెనుబల్లి, ఏప్రిల్ 14(జనం సాక్షి)పొత్తులు సీట్లు మాకు ముఖ్యం కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ద్యేయం సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు, అనేక దశాబ్దాల పాటు ప్రజాస్వామ్య భారతదేశంలో కొనసాగిన రాజ్యాంగ విలువలకు బిజెపి తిలోదకాలు ఇచ్చి ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధకాండ చేస్తుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త ప్రజాపోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వి ఎమ్ బంజరలో నాలుగు రోడ్ల కూడలిలో భారీ ఊరేగింపు జరిపి కొత్తగూడెం రోడ్డులోని అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రజాపోరు యాత్రలో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం పునాదులుగా రూపుదిద్దుకున్న వ్యవస్థ ఇప్పుడు బిజెపి కారణంగా ప్రమాదంలో పడిందని భాగం అన్నారు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మోడీ విధానాలతో కుదేలైందని ఆయన ఎద్దేవా చేశారు. సంపన్నుల కోసం మాత్రమే బిజెపి పరిపాలన కొనసాగుతుందని భాగం విమర్శించారు, ఈ దేశంలో సామాన్యులు సమిధలుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, కార్పొరేట్ శక్తులకు అన్ని వనరులు కల్పిస్తున్న బిజెపి అంబానీ ఆదానీలను పెంచి పోషించి భారత దేశ సంపదను వారికి దోచిపెడుతుందని ఆయన ఆరోపించారు, మతం పేరున విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తున్నదని అన్నారు, బిజెపి విధానాలను ప్రశ్నించిన వారిపై నిర్బంధాలు కొనసాగిస్తూ జైలుకు పంపుతూ మతం పిచ్చి తో హత్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు,విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపిని ఇంటికి పంపడం ఒకే ఒక ఎజెండాగా వామపక్ష లౌకిక ప్రజా యాత్రను సిపిఐ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు, బిజెపిని గడ్డదించేందుకు ఏ రాజకీయ పార్టీలతోనైనా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు,సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ మునుగోడు లో బి ఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ఇచ్చాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని కానీ మా వాదన ఓట్లు కాదు సీట్లు కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ మాకు ముఖ్యం అని అన్నారు. తెలంగాణలో బిజెపిని కాలు మోపనీయమని బిజెపికి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో మా పార్టీ కలిసి వచ్చే విధంగా ప్రతి నిర్ణయం తీసుకుంటామని అన్నారు, రాష్ట్రంలో అనేక సమస్యల పట్ల సిపిఐ పోరాడుతూనే ఉందని యాత్రలో భాగంగా పోడు భూములకు పట్టాలు ,సీతారామ ప్రాజెక్టు నిర్మాణం,రేషన్ కార్డులు,మౌలిక సదుపాయాల కల్పన,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,ధరణి రద్దు,ఇతర సమస్యల పరిష్కారం లక్ష్యంగా సిపిఐ జిల్లాలో అన్ని మండలాల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడుతుందని పోటు ప్రసాద్ గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, యర్రబాబు, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణ కుమార్, ఏపూరి లతా దేవి, సిపిఐ మండల కార్యదర్శి కొమ్మినేని సుధాకర్,సీపీఎం జిల్లా నాయకులు చలమల విఠల్,మాలమహానాడు రాష్ట్ర నాయకులు మేకతొట్టి కాంతయ్య, బి ఆర్ఎస్ యువజన నాయకులు వంగా నిరంజన్, సీపీఐ మండల నాయకులు పోదిల భాస్కర్, పైదా కిరణ్, మడకం రమేష్, తదితరులు పాల్గొన్నారు




