ప్రశ్నిస్తే దాడులు చేస్తారా
* టిఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు
* బిజెపి ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఆవుదుర్తి శ్రీనివాస్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
నగర అభివృద్ధి పై ప్రశ్నిస్తే టిఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఆవుదుర్తి శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఈస్ట్ జోన్ ప్రధాన కార్యదర్శి మాసం గణేష్ పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్పొరేటర్ ఐలెందర్ యాదవ్ తో పాటు అతని అనుచరులు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 9 వ డివిజన్ పరిధిలోని బీజేవైఎం నాయకులు సందీప్ రెడ్డి, కిరణ్ రెడ్డిలపై కూడా దాడి చేశారని వెల్లడించారు. ప్రజల్లో బిజెపికి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా దాడులు ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టిఆర్ఎస్ నాయకులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో వాణిజ్య సెల్ కన్వీనర్ పసుపులేటి శివానందం, అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఉమా మహేష్, బీజేపీ సీనియర్ నాయకులు కుంటల మధు ఉన్నారు