ఏప్రిల్ 7 (జనం సాక్షి) ::: తూప్రాన్ లోని 50 పడకల ఆసుపత్రిలో రాత్రి నొప్పులు రావడంతో డెలివరీకి వచ్చిన మహిళ పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో స్ట్రక్చర్ పైనే డెలివరీ అయిన సంఘటన తూప్రాన్ సామాజిక ఆసుపత్రిలో జరిగింది మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఉన్నాయితూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీనివాస్ తన భార్య వనజను పురిటి నొప్పులు రావడంతో తూప్రాన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తీసుకొని వచ్చి నొప్పులు వచ్చాయని డ్యూటీ డాక్టర్‌కు తెలిపారు ఆమెకు ఇంకా 15 రోజుల సమయం డెలివరీ ఉందని వెళ్ళిపొండి అని నిర్లక్ష్యం సమాధానం చెప్పారు నిండు గర్భిణిగా ఉన్న తన భార్యకు అధిక నొప్పులు రావడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్ల, నర్సుల వద్దకు వెళ్లి మేడం మా భార్యకు ఎక్కువగా నొప్పులు వస్తున్నాయి మీరు వచ్చి కాస్త చూడండి అని మొరపెట్టుకున్నాడు. వారు ఆ మాటకు మీ భార్యను ఇదివరకే చూసాము ఆమెకు 15 రోజుల వరకు నొప్పులు రావు, డెలివరీ కాదు అని తిరిగి సమాధానం ఇచ్చారు. లేదు మేడం మా భార్యకు ఎక్కువ నొప్పులు వస్తున్నాయి ఒకసారి మీరు వచ్చి చూడండి పేషెంట్ పరిస్థితి ఏవిధంగా ఉందో మీకు అర్థం ఔతుందని ఎంత మొరపెట్టుకున్నా డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ లో గేమ్ లు ఆడుకుంటూ కాలయాపన చేశారే తప్ప ఆమె వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించలేదు. మరి ఒకసారి భయాందోళన చెందుతూ భర్తయైన పీట్ల శ్రీనివాసు డ్యూటీలో ఉన్న వారి వద్దకు వెళ్లి మా భార్యకు నొప్పులు అధికంగా ఉన్నాయి మేడం.. ఒకసారి వచ్చి చూడండి అని మరొకసారి మొరపెట్టుకున్న వారు రాలేదు.
పిట్ల శ్రీనివాస్ భార్య వనజకు అధిక నొప్పులు రావడంతో అక్కడే ఉన్న మంచంపై డెలివరీ అయింది. ఆ సమయంలో వనజ భర్త మరియొకసారి డాక్టర్ల నర్స్ ల వద్దకు వెళ్లి రండి మేడం నాకు బాబు పుట్టాడు. ఒకసారి వచ్చి చూడండి అని చెప్పడంతో హుటాహుటిన వారు వచ్చి అయ్యో ఇలా జరిగిందేమిటి. అని కత్తెర ఎక్కడ, కాటన్ ఎక్కడ, అదెక్కడ, ఇది ఎక్కడ అని హడావుడి చేస్తూ పుట్టిన బాబును పరిశీలిస్తూ ఉమ్మనీరు మింగాడని ఈ బాబును ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని తన భర్త అయిన శ్రీనివాస్ కు చెప్పారు. వెంటనే వనజ భర్త పుట్టిన బాబును సురక్ష ప్రైవేట్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం వెళ్ళాడు. వనజ భర్త శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ తూప్రాన్ ప్రభుత్వ ధావఖానాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ లు నర్సులు డ్యూటీ సమయాన్ని వృధా చేస్తూ నిర్లక్ష్య వైఖరితో ఫోన్లో గేమ్‌లు ఆడుకుంటూ గర్భిణీల పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేరుకు మాత్రమే 50 పడకల దావకాన కానీ ఆపదలో పురిటి నొప్పులతో వచ్చిన పేషెంట్లను చూడకుండా సమయాన్ని వృధా చేస్తూ కాలయాపన చేస్తూ గర్భిణీల శిశువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పిట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు తూప్రాన్ సామాజిక ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు




