Wednesday, 4 November 2026

ఘనంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు

 

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :ఆదివారం శామీర్ పేట లో సుప్ర సిద్ద బెంగాలీ రచయిత, స్వాతంత్ర్య సమర యోధులు రవీంద్రనాథ్ ఠాగూర్ 142 వ జయంతి ని పురస్కరించుకుని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. జాతీయ గీతం జనగణమన గీతం రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ భారతావని గర్వించదగ్గ స్థాయికి తన సేవలు అందించారని తెలిపారు. నొబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశయాలను పునికి పుచ్చుకుని భారతావని కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప జేయాలని అఫ్జల్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆల్ఎస్ నాయకులు పి నర్సింహ రెడ్డి, బత్తిని చందర్ గౌడ్, నవీన్, మల్లేళ్ తదితరులు పాల్గొన్నారు.
7ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు