Monday, 2 November 2026

ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభం

బిచ్కుంద జూన్ 01 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల మార్కెట్ కమిటీకు 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రహారి గోడ నిర్మాణ పనులు చైర్మన్ నాగ్నాథ్ పటేల్ గురువారం నాడు ప్రారంభం చేశారు. ఇట్టి కార్యక్రమంలో నాల్చర్ రాజు, నాల్చర్ బాలు, మండల రైతు బంధు అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, బిచ్కుంద సొసైటీ ఉపాధ్యక్షుడు యాదవరావు, డాక్టర్ రాజు, ఉప సర్పంచ్ నాగరాజు మరియు మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు ఖాన్సాబ్, చేతన్ మరియు సహకార సంఘం పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.