గద్వాల నడిగడ్డ, జూన్ 1 (జనం సాక్షి); తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు లో భాగంగా మండలంలోని ప్రతి రైతు వేదికలో జూన్ 3న శనివారం రైతు దినోత్సవ వేడుక జరుపబడును అని వడ్డేపల్లి వ్యవసాయ అధికారిని రాధ తెలిపారు. రైతులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ సంబంధిత రైతు వేదికలో జూన్ 3 న శనివారం ఉదయం 10 గంటలకు హాజరు అయి రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆమె తెలిపారు.




