సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ను పకడ్బందీగా నిర్వహించాలని డిఐఈఓ జానపాటి కృష్ణయ్య అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 సెంటర్లలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.8 సెంటర్లను వృత్తి విద్యా కోర్సులకై ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 7886 మంది విద్యార్థుల్లో 5051 మంది జనరల్ విభాగంలో , 2835 మంది విద్యార్థులు ఒకేషనల్ విభాగంలో హాజరు కానున్నట్లు తెలిపారు.ప్రాక్టికల్స్ నిర్వహణకు మొదటి విడతలో 15 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ , 17 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు చెప్పారు.ప్లయింగ్ స్క్వాడ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు వారి హాల్ టికెట్స్ లో సెషన్ , సబ్జెక్టులను సరిచూసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్ టికెట్లు ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఈసీ మెంబర్స్ సోమయ్య , లక్ష్మయ్య , జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ యాదయ్య , జిజెఎల్ఏ జిల్లా అధ్యక్షులు సైదులు తదితరులు పాల్గొన్నారు.




