దండేపల్లి జనంసాక్షి ఫిబ్రవరి14 దండేపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ఘర్సే బూదామ్మ యేసయ్య నిరుపేద కుటుంబం కావడంతో ఆయన కూతురు శైలజకు ఈ నెల 16న పెళ్లి ఉండడంతో మాదాపూర్ గ్రామానికి చెందిన మిత్ర బృందం మంగళవారం 10.000 రూపాయలు నగదును ఆర్థిక సహాయంగా అందజేసి అండగా నిలిచారు అదే గ్రామానికి చెందిన మదం శెట్టి మల్లికార్జున్ 50 కిలోల బియ్యాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆడబిడ్డలకు అండగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు వీరిని గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో మర్రి ప్రవీణ రెడ్డి సుద్దాల రాజారావు చొప్పదండి రాజేష్ కుమ్మరి వేణు బూరుగు గంగన్న బలుసు వినోద్ కృపాకర్ పాదం నగేష్ తదితరులు పాల్గొన్నారు




