కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా ప్రతిపాదనలు
హైదరాబాద్,ఏప్రిల్22 : కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడిగా హరీష్ రావు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో 11 ప్రాజెక్టులను ఎఐబిపి కింద చేర్చారు.కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చేందుకు అంగీకరించిన 11 సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రి టి.హరీష్ రావు సవిూక్ష చేపట్టారు.సత్వర సాగునీటి ప్రయోజన ప్రణాళిక (ఎఐబిపి), ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పి.ఎమ్.కె.ఎస్.వై), ఆర్.ఆర్. ఆర్ లకు సంబంధించిన పనుల పురోగతిని మంత్రి సవిూక్షించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించిన149 ప్రాజెక్టులలో 99 ప్రాజెక్టులు ఉండగా తెలంగాణ ప్రాజెక్టులు 11 చోటుచేసుకోవడం శుభపరిణామమని మంత్రి అన్నారు. గతంలో ఎఐబిపి కింద సాగునీటి పధకాలలో దేవాదుల ఇదివరకే ఉన్నది. శ్రీకొమురంభీం, గొల్లవాగు, రల్లి వాగు, మత్తడి వాగు,పెద్దవాగుపై నీల్వాయి ప్రాజెక్టు , పెద్దవాగుపై జగన్నాధ ప్రాజెక్టు, పాలెం వాగు, ఎస్‌ఆర్‌ఎస్పి రెండోదశ, రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకాలను కూడా దేవాదులతో పాటు చేర్చాలని మంత్రి, ఎఐబిపి కింద గ్రాంట్ గా 1,155 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. నాబార్డు నుంచి కూడా ఈ 11 పాజెక్టులకు 2,825 కోట్ల రుణం పొందేందుకు ప్రయత్మిస్తున్నట్లు చెప్పారు. ఆయా పాజెక్టుల పనుల పురోగతి, నిధుల విడుదల, జిల్లా సాగునీటి ప్రాజక్టుల ప్రణాళిక తయారీ వంటి అంశాలపై సవిూక్షించనున్నారు. కొన్ని పధకాల పూర్తికి దశలవారీగా టైమ్ ఫ్రేమ్ తో పని చేయాల్సన అవసరం ఉందని మంత్రి భావిస్తున్నారు 2017 నాటికి ఏ మేరకు పనులు పూర్తవుతాయో చర్చించి నివేదికను కేంద్రానికి పంపించ వలసి ఉంటునీదని ఇరిగేషన్ అధికార వర్గాలు తెలిపాయి. పిఎంకె ఎస్ వైలో చోటు దక్కిన 11 ప్రాజెక్టులలో 7 మధ్యతరహా, 4 మేజర్ ప్రాజెక్టులున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 2017 మార్చి 31లోగా పధకాలు పూర్తి కావాలి. వరద కాలువ ప్రాజక్టు మాత్రం 2019 మార్చిలోగా పూర్తి చేసే రెండో జాబితాలో ఉన్నది. 11 ప్రాజెక్టులలో కొమరం భీం, గొల్లవాగు, రల్లి వాగు, మత్తడి వాగు, పెద్దవాగు ప్రాజెక్టులు 2006 లో అనుమతి పొందాయి. పాలెం వాగు, శ్రీరాంసాగర్ రెండో దశలకు 2005-06లో అనుమతి లభించింది. 2006-07 లో దేవాదుల, జగన్నాధపూర్ ప్రాజెక్టులు అనుమతి పొందాయి. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకానికి 2007-08లో అనుమతి లభించింది.ఈ 11 ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్రం నుంచి 60 శాతం గ్రాంట్ల రూపంలో విడుదల కావలసి ఉందని మంత్రి హరిష్ కేంద్రాన్ని కోరుతున్నారు. మిగిలిన మొత్తాన్ని నాబార్డు ద్వారా రుణం రూపంలో ఎఫ్‌ఆర్‌బిఎమ్‌తో సంబంధం లేకుండా సమకూర్చుకోవడానికి కేంద్రమే గ్యారంటీగా వుండాలని మంత్రి కోరుతున్నారు.
ప్రాజెక్టుల త్వరితగతిని పూర్తికి కార్యాచరణ




