ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నాం
దేశం చూపంతా పోలవరం నిర్మాణంపైనే
రికార్డు సమయంలో డయా ఫ్రం వాల్ నిర్మాణం
నీరుాప్రగతి, నీరుాచెట్టు పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి
అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,జూన్11(జనం సాక్షి): దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నామని, డయా ఫ్రం వాల్ నిర్మాణం 414 రోజుల్లోనే పూర్తిచేయడం ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. సోమవారం ఉదయం నీరు-ప్రగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరి దృష్టి తమ ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఉందని చెప్పారు. 24 గంటల్లో 11,158 క్యూ.విూ. కాంక్రీట్ వేయడం రికార్డు అని అభినందించారు. 42 గంటల్లో 19,500 క్యూ.విూ కాంక్రీట్ అధిగమించాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. కాఫర్ డ్యాం పనులు జెట్ గ్రౌటింగ్ విధానంలో పూర్తి చేస్తున్నామని బాబు చెప్పారు. పోలవరం పూర్తిచేయడం తామందరి సంకల్పమని పేర్కొన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ రూపొందించడం తమ లక్ష్యమన్నారు. గండ్లు పడకుండా అన్నిచెరువులు కాపాడుకోవాలని అధికారులకు చెప్పారు. కట్టల పటిష్టం, కంప నరికివేత పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రతి ఊళ్లో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వగలగాలని సీఎం అన్నారు. లోటు వర్షపాతంలో కూడా 2.21 విూటర్లు భూగర్భజలం పెరిగిందని చెప్పారు. నీరు-ప్రగతి, నీరు-చెట్టు పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. వానాకాలంలో 3 విూ., వేసవిలో 8విూ.లోతున భూగర్భజలాలు ఉండాలని అధికారులకు చంద్రబాబు తెలిపారు. నెలలో నరేగా పనులు మరింత చురుకుగా జరగాలన్నారు. పంట కుంటల తవ్వకం పనులు ముమ్మరంగా జరగాలని అన్నారు. నీరు, పచ్చదనంతోపాటు పరిశుభ్రత పెరగాలన్నారు. ఓడీఎఫ్ స్ఫూర్తితో ఓడీఎఫ్ ప్లస్ కూడా విజయవంతం చేయాలని సీఎం పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న 4,500వర్క్ షెడ్లు వెంటనే పూర్తిచేయాలన్నారు. మరో 6వేల వర్క్ షెడ్లకు అడ్మినిస్టేట్రివ్ శాంక్షన్స్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులకు అన్నిరకాల ఇన్ పుట్స్ అందజేయాలన్నారు. తెగుళ్ల గురించి ముందస్తు అంచనా వేయాలని, ఇస్రో, ఆర్టీజీ సేవలను వినియోగించు కోవాలని చంద్రబాబు తెలిపారు. ఇకపోతే గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మెషీన్ కటింగ్ వల్ల తేమ 17శాతం కంటే ఎక్కువ ఉండటం సహజమని, దానిని అడ్డం పెట్టుకుని రైతులకు ధర తగ్గించడం సరికాదన్నారు. తేమసాకుతో వ్యాల్యూ కట్ చేస్తే సహించేదిలేదని సీఎం స్పష్టం చేశారు. వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అందరికీ రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యశాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. చిన్నారులందరికీ త్వరలోనే హెల్త్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈనెలలో నరేగా పనులు మరింత చురుకుగా జరగాలని సూచించారు. పంట కుంటల తవ్వకం పనులు ముమ్మరంగా జరగాలన్నారు. నీరు, పచ్చదనంతో పాటు పరిశుభ్రత పెరగాలని సూచించారు. దీనివల్ల అందరిలో శక్తి, ఉత్తేజం పెరుగుతాయన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినవాళ్లు కూడా ప్రశంసించేలా పనులు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఓడీఎఫ్ స్ఫూర్తితోనే ఓడీఎఫ్ ప్లస్ కూడా విజయవంతం చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న 4,500వర్క్ షెడ్లు వెంటనేపూర్తిచేసి, మరో 6వేల వర్క్ షెడ్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. రాబోయే నెలరోజులు వాతావరణాన్ని విశ్లేషించి.. తెగుళ్ల గురించి ముందస్తు అంచనా వేయాలన్నారు. ఇస్రో,ఆర్టీజీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.