గద్వాలటౌన్ : ప్రజల ప్రాణాలను హరించే పరిశ్రమలు నిర్వహించే వ్యాపారులను తరిమికొట్టాలని ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. బుధవారం గద్వాల బంద్ అనంతరం వైఎస్సార్చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే డీకే అరుణ ప్రసంగించారు. యాసిడ్ డీలిం టింగ్ పరిశ్రమలకు మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా అనుమతి లేదన్నారు. అలాంటి నిషేధిత డీలిం టింగ్ పరిశ్రమలను గద్వాలలోనే ఎందు కు నడిపిస్తున్నారని ప్రశ్నించారు. యాసి డ్ డీలింటింగ్కు అడ్డు చెప్పినందునే బండ్ల సోదరులు బంగ్లా వీడారని విమర్శించారు.
బంగ్లా లేకుంటే.. బండ్ల సోదరులకు బతుకేలేదని మండిపడ్డారు. అత్తా, మామ పేర్లు చెప్పనిదే పూట గడవని బండ్ల సోదరులకు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని దుయ్యబట్టారు. మన్నాపురం క్రషర్ ప్లాంట్‌లో నిజాయితీగా వ్యాపారం ఉంది కాబట్టే విచారణ సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం కల్పించామన్నారు. అక్రమంగా యాసిడ్ డీలింటింగ్ వ్యాపారం చేస్తుండటం వల్లనే కౌన్సిల్ సభ్యులను మిల్లు యాజమాన్యం అడ్డుకుందన్నా రు.
మహిళ అని చూడకుండా చైర్పర్సన్ పద్మావతిపై దురుసుగా ప్రవర్తిం చారని, దళితవర్గానికి చెందిన వైస్ చైర్మ న్ శంకర్‌తోపాటు కౌన్సిలర్లు చందు, వెంకటేష్, నర్సింహులుపై రాళ్లతో దాడిచేసి గాయపర్చారని ఆరోపించారు. రౌడీషీటర్లకు, హత్యకేసు నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల కనుసన్నల్లోనే టీఆర్ఎస్ నేతల ఇసుక అక్రమ వ్యాపారం కొనసాగుతుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో చైర్పర్సన్ పద్మావతి, వైస్‌చైర్మన్ శంకర్, మార్కెట్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
జిన్నింగ్ ముసుగులో దోపిడీ
నడిగడ్డ ప్రాంతంలో కొంతమంది అక్రమార్కులు సీడ్ జిన్నింగ్ ముసుగులో అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారని ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పర్యావరణ అధికారుల నిబంధనలకు అనుగుణంగా యాసిడ్ డీలింటింగ్ పరిశ్రమలు నడిపితే అభ్యంతరం లేదని పేర్కొన్నారు. రూ.కోట్ల ఆదాయం కోసం ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు హరించే హక్కు వారికి ఎక్కడిదని ప్రశ్నించారు.
పర్యావరణ అధికారుల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పిన 18మంది పరిశ్రమల యజమానులలో ఒక్క రమ్య ఇండస్ట్రీస్‌లోనే అక్రమంగా డీలింటింగ్ నడుస్తుందని ఆరోపించారు. డీలింటింగ్కు, రైతులకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. గతంలో పత్తి సుంకు విషయంలో రాజకీయాలకు పాల్పడి రైతులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. అప్పుడు శాస్త్రవేత్తలను పిలిపించి సుంకు రాకపోవడానికి గల కారణాలపై అధ్యయనం చేయించామన్నారు. ప్రస్తుతం రైతులలో అపోహలు కల్పించి తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు.




