Tuesday, 3 November 2026

22ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నజీర్ అరెస్ట్

హైదరాబాద్ : బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు నజీర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.  దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న నజీర్ …ఫజీయుద్దీన్ గ్యాంగ్లో సభ్యుడు. నజీర్పై అబిడ్స్, హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కర సేవకులు పాపయ్య గౌడ్, నందరాజు గౌడ్ దాడి కేసులో నజీర్ నిందితుడు. గతంలో బెయిల్పై బయటకు వచ్చిన అతడు… అనంతరం దుబాయ్ పారిపోయాడు.   22 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నజీర్ను సిట్ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *