Tuesday, 3 November 2026

ప్రారంభమైన ఓపెన్ ప్రత్యేక ప్రవేశాలు

 

 

 

ప్రారంభమైన ఓపెన్ ప్రత్యేక ప్రవేశాలు
జుక్కల్, నవంబర్1, (జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ పది ఇంటర్ ప్రత్యేక ప్రవేశాలు మంగళవారం ప్రారంభ మైనట్లు స్టడీ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ సిజే కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వరకు ప్రవేశాలు కొనసాగుతాయని, ఇది చివరి అవకాశమని తెలిపారు. ఇక ఓపెన్ పదిలో చేరేందుకు ఏ తరగతి చదివినా 14సంవత్సరాల వయస్సు ఉంటే అర్హులని తెలిపారు. ఇంటర్ కు పది పాసయితే చాలని తెలిపారు. చదువు మద్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వార చదువు కొనసాగించ వచ్చని తెలిపారు