తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష ప్రారంభమైంది. 1032 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈరోజు గ్రూప్-2 తొలి రెండు పేపర్లు జరుగుతుండగా.. మిగిలిన రెండు ఆదివారం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు 73చోట్ల మొత్తం 1,916 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పర్యవేక్షణలో ఈ పరీక్షను రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నిర్వహిస్తోంది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీస్) పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2(చరిత్ర, రాజనీతి, సమాజం) పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలూ ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే జరుగుతాయి. తొలి పేపర్‌కు హాజరు కాని వారిని మిగిలిన పేపర్లకు అనుమతించరు.
ప్రారంభమైన గ్రూప్-2 పరీక్షలు




