ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పదవి బాధ్యతలు.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

వనపర్తి జిల్లా కోర్టులో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా బి రవికుమార్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు, గత కొంతకాలంగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్ ఖాళీ గా ఉండడంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు వనపర్తి కోర్టులో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న బి రవికుమార్ ను ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి కల్పించి ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు, దీంతో కోర్టు సిబ్బంది సమక్షంలో సోమవారం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా పదవీ బాధ్యతలు చేపట్టారు, ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది జడ్జిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా వనపర్తి జిల్లా కోర్టుకు మొదటి అదనపు జూనియర్స్ సివిల్ జడ్జిగా బండారి శ్రీలత నూతనంగా రానున్నారు .