Tuesday, 3 November 2026

ప్రియదర్శిని కళాశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన

ప్రియదర్శిని కళాశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు హుజూర్ నగర్ డిసెంబర్ 1 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక ప్రియదర్శిని జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2,3 ల ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సును గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిటిసి అధికారి విజయకుమార్ పాల్గొని మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి సమాజంలోని అందరికీ తెలియజేయవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని అన్నారు. ఎయిడ్స్ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది దాని పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా రక్తదానం ఆవశ్యకతను జన చైతన్య ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ, సభ్యులు శివ వివరించారు. ఎవరికైనా రక్తం అవసరం ఉన్నట్లయితే జన చైతన్య ట్రస్టును సంప్రదించాలని, ఎవరైనా రక్తం ఇవ్వవలసి ఉన్నట్లయితే ట్రస్టు సభ్యులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ సభ్యులు విజయ్ కుమార్, జన చైతన్య ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ, సభ్యులు శివ, ప్రిన్సిపల్ మట్టపల్లి రవీందర్, ప్రోగ్రాం ఆఫీసర్స్ జక్కుల రమేష్, నాగేశ్వరరావు, శిరీష, అధ్యాపక బృందం కనకాంబర కుమార్, సత్యనారాయణ, శ్రీను, రజనీ కుమార్, రమేష్, శ్రావణి, సోనీ, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.