హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమాకాంత్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి రానుంది. ఎల్లుండి జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. కాగా పంచాయితీ ఎన్నికల తేదీలు ఖరారు అయ్యాయి. మూడు దశలుగా ఈ నెల 23,27,31 తేదీల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి.




