Thursday, 5 November 2026

ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు

ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు.. ??
గులాబీ నేతలు హల్ చల్…??

* అధికార పార్టీలో ఉన్న వారికి పోడు భూములు దక్కాలని
అధికారులు నిర్ణయం

పోడు భూముల గ్రామసభ ఒకరికొకరు కొట్టుకున్న వైనం

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో పోడు భూముల గ్రామసభలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన 98 మంది రైతులు పోడు భూముల పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 32 మంది మాత్రమే అర్హులుగా అధికారులు ప్రకటించడంతో గతంలో గ్రామసభను బహిష్కరించారు. నేడు తిరిగి గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజా గౌడ్ సెక్రెటరీ అంజయ్య గ్రామసభ నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పట్టా కాగితాలు ఇవ్వాలని రైతులు వాగ్వాదానికి దిగారు కావాలని టిఆర్ఎస్ నేతలకు మాత్రమే పట్టా సర్టిఫికెట్లు ఇస్తున్నారని మిగతా రైతులను పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు