ప్రేమజంటను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు

రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం

జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో మానవత్వానికి మచ్చతెచ్చే ఉదంతం వెలుగు చూసింది. ఓప్రేమజంటను నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందారు. బిజెపి ఏలుబడిలో ఉన్నా రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ పరిధిలోని చీర్వాకు చెందిన సెర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అక్కడ గుమిగూడిన జనమంతా దీనిని వినోదంగా చూశారేతప్ప ప్రేమ జంటకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. పైగా దీనిని వీడియో తీశారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఒక యువకుడు సవిూపంలోని మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. తరువాత ఆ యువతిని అతను గ్రామానికి తీసుకువచ్చాడు. ఇది గ్రామంలోనివారికి ఎంతమాత్రం నచ్చలేదు. దీంతో ప్రేమ జంటకు శిక్ష విధించాలని భావించిన గ్రావిూణులు ఆ ప్రేమ జంట ధరించిన దుస్తులను తొలగించి తాడుతో కట్టేశారు. తరువాత వారిని నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. సమాచారం అందుకున్న సుఖేర్‌ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రావిూణుల బారి నుంచి ఆ ప్రేమజంటను విడిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.