ప్రైవేట్‌ ఫీజులపై విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్‌,(జనంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్డూ అదుపు లేకుండా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యలయం ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అసలు ప్రైవేట్‌ పాఠశాలలు ఏ ప్రమాణాలు పాటిస్తామని, ఏ నీడ్స్‌ ఉన్నాయని గుర్తింపు లేని పాఠశాలను వెంటనే సీజ్‌ చేయాలని కోరారు. ఈ ఆందోళనలో ఎస్‌.ఎఫ్‌.ఐ, ఏఐ.ఎస్‌.ఎఫ్‌.ఐ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.