Tuesday, 3 November 2026

ప్రైవేట్ పాఠశాలకు కొమ్ము కాస్తున్న ఎంఈఓ పూల్ చంద్ ను సస్పెండ్ చేయాలి

కురవి జూన్ /1/జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని అనుమతులు లేకున్న నడుస్తున్న ప్రవేటు పాఠశాలలకు అండగా ఉంటున్న ఎంఈఓ పూల్ చంద్ ని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ కురవి మండల అధ్యక్షుడు వీరెందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మధు మాట్లాడుతూ కురవి మండలంలో ప్రవేటు పాఠశాలల ఇష్టారాజ్యం నడుస్తుంది అన్నారు.తమ ఇష్ట రీతిగా ఫీజుకు పెంచుకున్న ఎంఈఓ చర్యలు తీసుకోకుండా ప్రవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్నారు అని అన్నారు.దానితో పాటు ప్రవేట్ పాఠశాలలు రెన్యువల్ చెపించాకుండా నడిపిస్తున్నారని ఎంఈఓ కార్యలయంలో వినతిపత్రం అందజేసిన పట్టించుకోకపోవడం ఏమి తెలియనట్టు వ్యవహరిస్తున్నారు.కనీసం ఎలాంటి చర్యకు పూనుకోకుండా తన ఇష్టారితిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎంఈఓ అండదండాలతో ప్రవేట్ పాఠశాలలు ఇష్టారితీగా ఫీజులు పెంచుకుంటూ,,అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు..తక్షణమే ఎంఈఓ పూల్ చంద్ ను సస్పెండ్ చేయాలని ,లేని యెడల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చారించారు..ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గందసిరి జ్యోతి బసు,మండల కార్యదర్శి మురళి ,నాయకులు వాసు,వెంకటేష్ ,మహేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.