కురవి జూన్ 1 జనం సాక్షి న్యూస్ :
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారాయణపురం గ్రామ ప్రజలు పాత తండాలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాలో భాగంగా గురువారం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమం హాజరై శ్రీ ఆంజనేయ స్వామి వారికి దర్శించుకున్న ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ దేవత బొడ్రాయి, శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు గ్రామ, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు గ్రామంలో ఆయురారోగ్యాలతో,పాడి పంటలతో, పశుసంపదనాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలు పాల్గొన్న -ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్




